ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభమయ్యేది అప్పుడే..

Inter Second Year Classes. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది.

By Medi Samrat  Published on  14 Jun 2021 11:19 AM GMT
ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభమయ్యేది అప్పుడే..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ సెకండ్ ఇయర్ విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగబోతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా జులై 5 వరకు మొదటి సంవత్సరంలో మొదటి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ చెప్పారు. జూన్ 16 నుంచి కాలేజీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభిస్తామని తెలిపారు.

ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లను రెండు, మూడు విడతల్లో జరపనున్నారు. తొలి ఏడాది విద్యార్థులకు కూడా దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు ప్రసారం చేస్తామని చెప్పారు. 70 శాతం సిలబస్‌ ఆధారంగానే క్లాసులు జరుగుతాయని చెప్పారు. 2021-22 విద్యాసంవత్సరానికి 70శాతం సిలబస్‌ నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థులు కాలేజీల్లో పాఠాలు వినేందుకు డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది.


తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్,సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ సెకండియర్‌ చదువుతున్న దాదాపు 4లక్షల 73వేల పైచిలుకు మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా వారికి సెకండియర్‌లో మార్కులను ఇచ్చింది. ఫస్టియర్‌లో బ్యాక్ లాగ్స్ ఉన్నవారికి కనీస మార్కులు 45తో పాస్ చేసింది. సెకండియర్‌లోనూ 45 మార్కులు వేసి పాస్ చేశారు.


Next Story