కరీంనగర్‌లో అమానుషం.. సుల‌భ్ కాంప్లెక్స్‌లో మ‌హిళ ప్ర‌స‌వం

Infant dead body found in sulabh complex. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ గర్భిణీ.. సులభ్‌ కాంప్లెక్స్‌లో ఆడ శిశువును ప్రసవించింది.

By అంజి  Published on  11 Dec 2021 12:53 PM IST
కరీంనగర్‌లో అమానుషం.. సుల‌భ్ కాంప్లెక్స్‌లో మ‌హిళ ప్ర‌స‌వం

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ గర్భిణీ.. సులభ్‌ కాంప్లెక్స్‌లో ఆడ శిశువును ప్రసవించింది. ఆ తర్వాత మృతి చెందిన శిశువును చున్నీలో ఉంచి, అక్కడే వదిలి పెట్టి వెళ్లిపోయింది. ఈ అమానుష ఘటన రాంనగర్‌ చేపల మార్కెట్‌ దగ్గర జరిగింది. మార్కెట్‌లో చేపలు విక్రయించే మహిళలు ఆడ శిశువును గుర్తించారు. ఆ తర్వాత వాచ్‌మెన్‌కు విషయం చెప్పారు. వెంటనే అప్రమత్తమైన వాచ్‌మెన్‌ పోలీసులు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

అయితే నిన్న రాత్రి సులభ్‌ కాంప్లెక్స్‌కు ఓ గుర్తు తెలియని మహిళ వచ్చినట్లు పోలీసులకు వాచ్‌మెన్‌ చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతి చెందిన శిశువు సులభ్‌ కాంప్లెక్స్‌లో ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే మృతి చెందిన ఆడ శిశువును ఎవరైనా తీసుకువచ్చి అక్కడ వదిలి వెళ్లారా.. లేదా గుర్తు తెలియని మహిళ ప్రసవించిన తర్వాత ఆడపిల్ల పుట్టిందని చంపి, వదిలి వెళ్లిందా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Next Story