ఆ 863 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం

వ‌రంగ‌ల్ కాకతీయ మెగా టెక్స్​టైల్స్​ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Medi Samrat  Published on  16 Nov 2024 3:30 PM IST
ఆ 863 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం

వ‌రంగ‌ల్ కాకతీయ మెగా టెక్స్​టైల్స్​ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెక్స్ టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు 863 మంది భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బీఆర్ఎస్ హయంలో తాము భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని, తమకు న్యాయం జరగలేద‌ని టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వారికి న్యాయం చేయడానికి ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ క్ర‌మంలోనే భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి.

వరంగల్‍ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో చింతలపల్లి వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2016 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి దశలవారీగా 1357 ఎకరాలను సేకరించారు. ఈ క్రమంలో 2017 అక్టోబర్‍ 22న అప్పటి సీఎం కేసీఆర్ కాకతీయ టెక్స్ టైల్ పార్క్​కు శంకుస్థాపన చేశారు.





Next Story