ఇళ్ళందకుంటలో ఉద్రిక్తత.. ఇందిరాశోభన్ అరెస్ట్

Indira Shoban Arrest. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

By అంజి  Published on  27 Aug 2021 6:00 AM GMT
ఇళ్ళందకుంటలో ఉద్రిక్తత.. ఇందిరాశోభన్ అరెస్ట్

ఉపాధి పాదయాత్రకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులు..

రెండు రోజుల క్రితమే పర్మిషన్ కోసం సీపీకి లెటర్ పెట్టిన ఇందిరాశోభన్

మొదట పాదయాత్రకు ఒకే చెప్పి, తర్వాత మాట మార్చారని ఆవేదన

పోలీసులకు, ఇందిరా శోభన్ కు మధ్య వాగ్వివాదం

కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళ నాయకురాలు ఇందిరా శోభన్ చేపట్టిన ఉపాధి భరోసా యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఇందిరా శోభన్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి పాదయాత్రకు పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం పాదయాత్రకు పర్మిషన్ కోసం సీపీకి ఇందిరాశోభన్ లెటర్ రాశారు. మొదట పాదయాత్రకు ఒకే చెప్పి, ఇప్పుడు మాట మార్చారని ఇందిరా శోభన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అనంతరం ఇళ్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆలయంలోకి ప్రవేశించి ఇంద్రశోభన్‌ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందిరా శోభన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇళ్లందకుంట చౌరస్తాలో ధర్నా చేపట్టారు.

ఇటీవలే ఇందిరాశోభన్ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి రాజీనామా చేశారు. మొదట్లో పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన తగిన గుర్తింపు లభించకపోవడంతో షర్మిల పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయితే ఇందిరా శోభన్‌ మాత్రం ఇంకా తను ఏ పార్టీలో చేరుతున్నాన్న విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


Next Story