'హర్ ఘర్ తిరంగా' ద్వారా దేశ భ‌క్తిని చాటండి

India National flags making for har ghar tiranga. 75వ‌ స్వతంత్ర దినోత్స‌వ‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశ‌వ్యాప్తంగా

By Medi Samrat
Published on : 3 Aug 2022 5:12 PM IST

హర్ ఘర్ తిరంగా ద్వారా దేశ భ‌క్తిని చాటండి

75వ‌ స్వతంత్ర దినోత్స‌వ‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశ‌వ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15నాడు ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర సాంస్క‌తిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

కేంద్ర సాంస్క‌తిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేశ భక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా హర్ ఘర్ తిరంగా కోసం దేశ ప్రజలకు పంపిణీ చేసేందుకు భారీ సంఖ్యలో జాతీయ జెండాలను తయారుచేస్తున్నారు. జాతీయ జెండాను తయారు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశీయ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం 'కూ' లో షేర్ చేశారు.

ఇదిలావుంటే.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌రరాజన్ హైదరాబాద్ రాజ్‌భవన్‌లోని గార్డెనింగ్ & శానిటరీ సిబ్బందికి వరద సహాయక సామగ్రితో పాటు జాతీయ జెండాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారితో దిగిన ఫోటోను కూ లో షేర్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తిని రగిలించిన పీఎంవో ఇండియాకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.



Next Story