హైదరాబాద్: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) - హైదరాబాద్ సూచన ప్రకారం.. నగరంలో శుక్రవారం మధ్యాహ్నం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.0 హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మహబూబ్‌నగర్, హన్మకొండ, కామారెడ్డి, వరంగల్, జగిత్యాల్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం తర్వాత వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. శుక్రవారం నగరంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షం/ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది. సాధారణంగా ఇవాళ మేఘావృతమైన ఆకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే నగరానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. కాగా గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.