కంచ గచ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది.

By Medi Samrat
Published on : 3 April 2025 2:45 PM IST

కంచ గచ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని కోర్టు ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది.

సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉన్న 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని, అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు. పిటిషన్‌పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Next Story