తుఫాను కంటే ముందు.. 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీలో వర్షాలు

అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణా రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని

By అంజి  Published on  4 May 2023 7:00 AM GMT
IMD,rains,Telangana ,AP  news, Weather alert

తుఫాను కంటే ముందు.. 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీలో వర్షాలు

అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణా రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు మోచా తుపాను తీర ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.

ఈ నెల 7వ తేదీ వరకు ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8 లేదా 9 నాటికి ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రంగా, మరికొన్ని రాష్ట్రాలపై మోస్తరుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

Next Story