కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థత గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క 4 కిలోమీటర్ల వరకు ర్యాలీగా వెళ్లారు. పాదయాత్ర తహశీల్దార్ కార్యాలయం చేరుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం సీతక్క కళ్లుతిరిగి స్పృహ తప్పడంతో అస్వస్థత గురయ్యారు. అప్రమత్తమైన కార్యకర్తలు సీతక్కను హుటాహుటిన ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు సీతక్క పేస్‌బుక్ వేధికగా మెదక్‌లో మూడేళ్ల పాపను హింసించిన శాడిస్టును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చూసినప్పడు రక్తం మరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడితే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. శాడిస్టు నాగరాజును వెంటనే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.