ముత్తంగి గురుకులంలో.. 25 మంది విద్యార్థినిలకు అస్వస్థత

Illness of 25 students in Muthangi Gurukulam. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో నిన్న 47 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

By అంజి  Published on  30 Nov 2021 7:14 AM GMT
ముత్తంగి గురుకులంలో.. 25 మంది విద్యార్థినిలకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో నిన్న 47 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా అదే గురుకుల పాఠశాలలో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. అయితే నిన్న చేసిన కరోనా పరీక్షల్లో 25 మంది విద్యార్థులకు నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. విద్యార్థినిలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. 25 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు.

ఇదిలా ఉంటే నిన్న విద్యార్థులకు చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన విద్యార్థినిలను వారి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకుపోయారని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఆదివారం నాడు ఓ విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో వారు వెంటనే గురుకులంలోని టీచర్లకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గురుకులంలో విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ముత్తంగి గురుకులంలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. విద్యార్థులందరికి కరోనా పరీక్షలు చేయగా 47 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. అయితే ప్రస్తుతం కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story
Share it