Ibomma Ravi : ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ.. రేపు బెయిల్‌పై వాదనలు
ఐబొమ్మ రవిని సీసీఎస్ పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకోగా.. నేటితో ఆ కస్టడీ ముగిసింది.
By - Medi Samrat |
ఐబొమ్మ రవిని సీసీఎస్ పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకోగా.. నేటితో ఆ కస్టడీ ముగిసింది. కస్టడీ ముగిసిన అనంతరం రవిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇదిలావుంటే.. ఐదురోజుల విచారణలో పోలీసులు రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు నిర్ధారించారు. టెలీగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలను కొన్నట్లుగా తెలుసుకున్నారు. అతని బ్యాంక్ అకౌంట్లో రూ.20 కోట్ల లావాదేవీలను గుర్తించారు. సినిమాలు చూసేందుకు వెబ్ సైట్ ఓపెన్ చేసిన వారికి ఏపీకే లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేశాడని, ఆ నిధులను భారత్ లో ఉన్న ఓ బ్యాంకుకు మళ్లించినట్లు గుర్తించారు. ఇక కస్టడీలో వెబ్ సైట్లు, సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు, ట్రాన్సాక్షన్లపై పోలీసులు విచారణ చేశారు. బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, విదేశాల్లో ఉన్న నెట్ వర్క్ లు, బెట్టింగ్ యాడ్స్ నుంచి వచ్చిన సొమ్మును వాడిన తీరుపై ప్రశ్నించారు. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో ఉన్న డొమైన్ల కొనుగోలుపై కూడా రవిని ప్రశ్నించారు.
ఐబొమ్మ రవి అడ్వకేట్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీలో కేవలం పోలీసులకు సహకరించలేదనేది అవాస్తవం. ఇమంది రవిపై మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క కేసులో మాత్రమే రిమాండ్ విధించారు. మరో 4 కేసులో పిటి వారెంట్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రవి బెయిల్ పిటిషన్ వేశాము.. మంగళవారం బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతాయని పేర్కొన్నారు.