మరికాసేపట్లో ముగియనున్న‌ ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ.. కీలక సమాచారం రాబట్టిన అధికారులు..

ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ మరికాసేపట్లో ముగియనున్న‌ది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 5:10 PM IST

మరికాసేపట్లో ముగియనున్న‌ ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ.. కీలక సమాచారం రాబట్టిన అధికారులు..

ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ మరికాసేపట్లో ముగియనున్న‌ది. 5 రోజుల క‌స్ట‌డీ పూర్తి కావడంతో పోలీసులు సాయంత్రం 5 గంటలకు రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఈ 5 రోజుల కస్టడీలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. రవి వెబ్సైట్స్, డొమైన్ నెట్వర్క్, ఐపీ మాస్క్ చేసిన ఎన్జిల సంస్థ ఇలా అన్నింటిపై పోలీసులు అరా తీసిన‌ట్లు స‌మాచారం. 20 కోట్ల లావాదేవీలపై బ్యాంకు అధికారుల సహకారంతో బదిలీ వివరాలు తెప్పించుకొని రవిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

రవి స్నేహితులు, చెల్లెలు చంద్రిక వ్యవహారంపై కూడా వివరాలు సేకరించినట్లు స‌మాచారం. రవి,స్నేహితుడు ఇద్దరూ కలిసి టెక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్, VPN/IP Masking వంటి అంశాల్లో పాల్గొన్నట్లు గుర్తించిన‌ట్లు తెలుస్తుంది. రవి, స్నేహితుడు నిఖిల్ క్రిప్టో ద్వారా భారీగా అమౌంట్ బదిలీ చేసుకున్నట్లు గుర్తించిన‌ట్లు స‌మాచారం. ర‌వి 1xbet, ఇతర యాప్స్‌ ద్వారా డబ్బుల సంపాదించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అయితే.. పోలీసుల ప్రశ్నకు నేను ఒక్కడినే అన్ని చేశాను.. నా వెనుక ఎవరు లేరని రవి చెప్పినట్లు తెలుస్తుంది. 36 బ్యాంకు ఖాతాలు, వాటి లావాదేవీలను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు స‌మాచారం. 5 రోజుల విచారణ పూర్తి కావడంతో మ‌రికాసేప‌ట్లో నాంపల్లి కోర్టుకు రవిని తీసుకెళ్లనున్నారు పోలీసులు..

ఐబొమ్మ రవి కస్టడీ కేసులో రేపు హైదరాబాద్ సీపీ సజ్జనర్ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 5 కేసులు న‌మోద‌య్యాయి. మిగతా కేసుల్లో విచార‌ణ‌కై సైబర్ క్రైమ్ పోలీసులు పిట్ వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుల‌పై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరపనున్నారు.

Next Story