తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers In Telangana. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులు స్థాన చలనం చెందారు. 14 మంది

By అంజి
Published on : 31 Aug 2021 2:47 AM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

14 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులు స్థాన చలనం చెందారు. 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనిత రామచంద్రన్, పరిశ్రమలశాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్, యువజన సర్వీసుల సంచాలకులుగా వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ కమిషనర్‌గా శరత్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా అబ్దుల్ అజీంను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలు జిల్లాల కలెక్టర్లకు కూడా స్థాన చలనం కల్పించింది.

వికారాబాద్ కలెక్టర్‌గా నిఖిల, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా జితేశ్ పాటిల్, నాగర్ కర్నూలు కలెక్టర్‌గా ఉదయ్‌కుమార్, జోగులాంబ కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి, మహబూబాబాద్ కలెక్టర్‌గా శశాంక, జనగామ కలెక్టర్‌గా శివలింగయ్య, వరంగల్ కలెక్టర్‌గా గోపిలను ప్రభుత్వం నియమించింది. అలాగే తెలంగాణ జైళ్ల శాఖ ఐజీగా వై.రాజేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌గా శివకుమార్ గౌడ్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.








Next Story