సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో సింగరేణికి సీఎండీ (ఎఫ్ఏసీ)గా దేవరకొండ కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుత ఛైర్మన్ ఎన్. బలరామ్ నుండి బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు.
కృష్ణ భాస్కర్ 2012 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించారు. తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖకు డైరెక్టర్ గానూ, రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీ గానూ వ్యవహరించారు.