సిద్దిపేట జిల్లాలో ఐఏఎఫ్‌ హెలికాప్టర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

IAF chopper makes emergency landing at Jagadevpur. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ (ZA449) బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ శివార్లలో సాంకేతిక లోపం

By అంజి  Published on  2 Feb 2022 3:02 PM IST
సిద్దిపేట జిల్లాలో ఐఏఎఫ్‌ హెలికాప్టర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ (ZA449) బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ శివార్లలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి చెందిన సాంకేతిక నిపుణులు, మరో హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకుని, చాపర్‌ను రిపేరు చేసే పనిలో ఉన్నారు. అకాడమీలోని ట్రైనీ పైలట్‌లు హెలికాప్టర్‌ను నడుపుతూ శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో ఉన్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి.

అయినప్పటికీ, వారు మానవ నివాసానికి దగ్గరగా సురక్షితంగా దిగారు. హెలికాప్టర్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బందోబస్తు కోసం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు ఎలా తలెత్తాయన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్‌ను రిపేర్ చేయడంతో, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిందే. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో సహా 13 మంది చనిపోయారు.

Next Story