బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు ఐ-బొమ్మ రవి

ఐ-బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు.

By -  Medi Samrat
Published on : 20 Nov 2025 4:25 PM IST

బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు ఐ-బొమ్మ రవి

ఐ-బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు.

వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవం కారణంగా అతడు మనుషులపై నమ్మకం కోల్పోయి, గత నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తన ఆచూకీ బయటపడుతుందనే భయంతో ఇంట్లో పనివాళ్లను కూడా పెట్టుకోలేదు. అతడి సెల్‌ఫోన్‌లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉన్నాయి.

Next Story