Video: భార్య పుట్టింటికి వెళ్లిందని..మద్యం మత్తులో దుర్గం చెరువులో దూకబోయిన భర్త

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు.

By Knakam Karthik
Published on : 26 July 2025 11:46 AM IST

Hyderabad News, Hydraa, Durgam Cheruvu, Cable Bridgem, man attempting suicide

Video: భార్య పుట్టింటికి వెళ్లిందని..మద్యం మత్తులో దుర్గం చెరువులో దూకబోయిన భర్త

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు. ఈ ఘటన శుక్రవారం (జూలై 25) సాయంత్రం చోటు చేసుకున్నట్లు హైడ్రా తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. వివరాల ప్రకారం.. రామిరెడ్డి అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం (జూలై 25) తాగిన మ‌త్తులో ఇంట్లో గొడ‌వపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కేబిల్ బ్రిడ్జ్ మీదినుంచి దుర్గం చెరువులో దూకి సూసైడ్ చేసుకోవడానికి యత్నించాడు. ఇదే సమయంలో కేబుల్ బ్రిడ్జిపై వ‌ర్షపు నీరు నిల‌్వకుండా కింద‌కు వెళ్లే రంద్రాలను శుభ్రం చేస్తున్న హైడ్రా టీం రామిరెడ్డిని గమనించింది.

చాక‌చ‌క్యంగా వ్యవహరించి చెరువులోకి దూకబోతున్న యువకుడిని అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని ఆత్మహత్యయత్నానికి గల కారణాలేంటని ఆరా తీశారు. మద్యం మత్తులో ఇంట్లో గొడవ కావడంతో చనిపోవాలనుకున్నానని పోలీసులకు తెలిపాడు యువకుడు. అనంతరం యువకుడికి కౌన్సింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ ఘటనతో కేబుల్ బ్రిడ్జిపై కాసేపు హైడ్రామా నడిచింది.

Next Story