చట్ట ప్రకారమే 'ఎన్ కన్వెన్షన్‌'లో అన్ని కట్టడాలను నేలమట్టం చేశాం : హైడ్రా

సినీ న‌టుడు నాగార్జున‌కు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చేతలపై హైడ్రా స్పందించింది.

By Medi Samrat  Published on  24 Aug 2024 6:06 PM IST
చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లో అన్ని కట్టడాలను నేలమట్టం చేశాం : హైడ్రా

సినీ న‌టుడు నాగార్జున‌కు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చేతలపై హైడ్రా స్పందించింది. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ లోని కట్టడాలను కూల్చివేశామ‌ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని.. హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవం అన్నారు. ఎఫ్టీఎల్‌లో కట్టడాలు ఉన్నందునే కూల్చి వేయడం జరిగిందని పేర్కొన్నారు. చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని.. చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలని కూల్చివేసింద‌ని తెలిపారు.

కట్టడాలని క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందన్నారు. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ ను అధికారులు గతంలోనే తిరస్కరించారని వివ‌రించారు. ఎన్ కన్వెన్షన్ పైన ఇప్పటికే లోకా యుక్తతో పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. ఎన్ కన్వెన్షన్‌లో పూర్తిగా అన్ని కట్టడాలను నేలమట్టం చేశామ‌ని.. ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం జీరో గా మారిందని తెలియ‌జేశారు.

Next Story