నగరంలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై ఉక్కుపాదం.. నలుగురు అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Dec 2023 3:00 PM IST
hyderabad, police,  drugs, four arrest ,

నగరంలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై ఉక్కుపాదం.. నలుగురు అరెస్ట్ 

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తుండగా ఈ స్మగ్లింగ్ విషయం బయటపడింది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేశారు. కోటి రూపాయల విలువైన 360 కేజీల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రేవంత్ రెడ్డి ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, హెచ్ న్యూ అదనపు డీజీ సీవీఆనంద్, సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీసు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిపై చర్చలు నిర్వహించారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ హెచ్చరించారు.

Next Story