హైదరాబాద్‌కు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

భారతీయ రైల్వే హైదరాబాద్‌కు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం . ప్రస్తుతం, రెండు వందే

By అంజి  Published on  16 April 2023 8:15 AM IST
Hyderabad , Vande Bharat express,  trains, SCR

హైదరాబాద్‌కు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

హైదరాబాద్: భారతీయ రైల్వే హైదరాబాద్‌కు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం . ప్రస్తుతం, రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు , ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య,మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లు వారం పొడవునా 99 శాతం కంటే తక్కువ కాకుండా ఆక్యుపెన్సీ రేటుతో నడుస్తున్న నగరంలోని రైలు ప్రయాణికులతో ప్రసిద్ధి చెందాయి.

డిమాండ్‌కు తగ్గట్టుగా ఈ రైళ్లలో రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో లభిస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) వర్గాలు తెలిపాయి. ఈ రెండు సర్వీసులు విజయవంతం కావడంతో మరో మూడు నాలుగు నెలల్లో హైదరాబాద్, బెంగళూరు , పూణేల మధ్య మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం.

ఒక రైలు కాచిగూడ - బెంగళూరు మార్గంలో నడపనుండగా, మరొకటి సికింద్రాబాద్ - పుణె మధ్య నడుస్తుంది. భారతీయ రైల్వే.. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి ఈ సేవలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య ఇప్పటికే అనేక రైళ్లు నడుస్తున్నాయి. రెండు నగరాలు దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌లు. సాధారణ ప్యాసింజర్ రైళ్ల ప్రయాణ సమయం సుమారు 12 గంటలు పడుతుంది. వందే భారత్ రైలు ఆ ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.

కాచిగూడ-బెంగళూరు మార్గం మధ్యలో వందేభారత్‌ రైలును ప్రవేశపెట్టిన వెంటనే సికింద్రాబాద్‌ నుంచి పూణే మధ్య వందే భారత్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వర్గాలు సూచించాయి. ఈ షెడ్యూల్‌లు వర్కవుట్ అయితే, దేశంలోని ఇతర నగరాల్లో నాలుగు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొందడంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటుంది.

Next Story