Video: షాప్‌లో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్, ఒక్కసారిగా పేలడంతో..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాగ్ అమీర్ ప్రాంతంలోని ఓ షాప్‌లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.

By Knakam Karthik  Published on  4 March 2025 2:26 PM IST
Telangana, Hyderabad, Cylinder Explodes,

షాప్‌లో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్, ఒక్కసారిగా పేలడంతో..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాగ్ అమీర్ ప్రాంతంలోని ఓ షాప్‌లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. వివరాల్లోకి వెళితే.. బాగ్ అమీర్‌లోని జయ భవాని గోల్డెన్ ఇన్ఫో సిస్టమ్స్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.

డొమెస్టిక్ సిలిండర్ నుండి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఉండేవారు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడి ధాటికి షాప్ మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నివాసాల సముదాయాల మధ్య గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story