ప్రవళిక ఆత్మహత్య కేసు.. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్

హైదరాబాద్: అశోక్ నగర్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఘటనలో చిక్కడిపల్లి సిఐ నరేష్ పై సస్పెన్షన్ వేటు పడింది.

By అంజి  Published on  16 Oct 2023 12:55 AM GMT
Hyderabad, Chikkadpally inspector, suspended , suicide case

ప్రవళిక ఆత్మహత్య కేసు.. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్

హైదరాబాద్‌: అశోక్ నగర్ హాస్టల్‌లో ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ నరేష్‌పై ఇటీవల నియమితులైన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఆదివారం సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎం ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ క్రమశిక్షణా చర్యను ఎదుర్కొన్నారు. ప్రవళిక ఆత్మహత్యతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ ప్రాంతంలో నిరసనలు జరిగాయి.

ఆత్మహత్య ఘటన తర్వాత అశోక్ నగర్ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళన నిర్వహించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పోటీ గ్రూప్ పరీక్షలను నిరంతరం రద్దు చేయడం వల్లే యువతి మృతి చెందిందని ప్రతిపక్షాలు వాదించాయి. అయితే, శ్రవణ్ అనే అబ్బాయితో ప్రవళిక ప్రేమ సంబంధంలో ఉన్నందున, ప్రవళిక వ్యక్తిగత సవాళ్లతో పోరాడుతోందని సూచిస్తూ పోలీసు శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. అతను ఆమెను మోసం చేసి, మరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని పోలీసులు ఆరోపించారు. ఇది ప్రవళికకు విపరీతమైన బాధను కలిగించిందని, చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు.

Next Story