కొనసాగుతున్న హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

Huzurabad, badvel by pole. తెలంగాణలో అందరూ ఆసక్తిగా ఎదురూ చూస్తున్న హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7

By అంజి  Published on  30 Oct 2021 1:50 AM GMT
కొనసాగుతున్న హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో అందరూ ఆసక్తిగా ఎదురూ చూస్తున్న హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొవిడ్‌ నిబంధనలతో అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇక పొలింగ్‌ చివరి గంట్లోల కొవిడ్‌ బాధితులు పీపీఈ కిట్లు ధరించి ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో జరుగుతున్న హుజురాబాద్‌ ఉప ఎన్నికల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్‌ఎస్‌ను వీడిన ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగారు. టీఆర్‌ఎస్‌ నుండి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుండి బల్మూరి వెకంట్‌ పోటీ చేస్తున్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలో మొత్తంగా 30 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 172 సమస్యాత్మకమైనవి, 63 అత్యంత సమస్యాత్మకమైనవి కావడంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్‌ నియోజకవర్గంలో కూడా పోలింగ్‌ ప్రశాంత సాగుతోంది. 2,15,292 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 281 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో 221 సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ప్రధాని పోటీ వైసీపీ, బీజేపీ మధ్య కనిపిస్తోంది.

Next Story
Share it