తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. మరో నాలుగు పథకాల అమలు
కాంగ్రెస్ హయంలో సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 13 Jan 2025 6:46 AM ISTతెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. మరో నాలుగు పథకాల అమలు
కాంగ్రెస్ హయంలో సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతలో లబ్ధి చేకూరని వారికి తరువాత విడతల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ సర్కార్ లక్ష్యమన్నారు. ఈ నెల 26నుంచి ప్రతిష్టాత్మకంగా మరో నాలుగు హామీలు అమలు చేస్తామన్నారు. అర్హత ఉండి ప్రజాపాలన యాప్ లో నమోదు కానీ దరఖాస్తులు మ్యానువల్ గా నమోదు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు సంక్షేమాల అమలులో అవలంభించాల్సిన విధివిధానాల పై హన్మకొండ ఐడీవోసీలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కలతో కలసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై కలెక్టర్ల కార్యాచరణ, సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తేదీన ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై గ్రామ, వార్డు సభలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, కార్యాచరణ కు సంబంధించిన వివరాలను సమావేశంలో అడిగి తెలుసుకున్నారు.