తెలంగాణ రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. రేపే రూ.2,00,000 రుణమాఫీ

మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

By అంజి  Published on  14 Aug 2024 6:33 AM IST
Telangana, farmers, farmer loan waiver, CM Revanth

తెలంగాణ రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. రేపే రూ.2,00,000 రుణమాఫీ

మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. దీంతో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్‌ ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన ఖమ్మంకు బయల్దేరతారు.

ఇదిలా ఉంటే.. రూ.లక్షన్నర వరకు రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా పలువురికి రుణాలు జమ కాలేదు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆధార్‌ కార్డు, పాస్‌బుక్‌లో పేర్లలో మార్పులు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురికి రుణమాఫీ కాలేదు.

Next Story