నిజామాబాద్‌లో షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేసింది. పోలీసుల వాదనపై ఫోరం సందేహాలను లేవనెత్తింది, ఇది "నకిలీ ఎన్‌కౌంటర్" కాదా అని ప్రశ్నించింది. ఈ సంఘటన రాష్ట్ర పోలీసులలో పెరుగుతున్న హింసాత్మక ధోరణులకు ప్రతిబింబమని వ్యాఖ్యానించింది. దొంగతనం కేసుల్లో నిందితుడైన రియాజ్, అక్టోబర్ 17న కస్టడీలోకి తీసుకుంటుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేశాడని, ఫలితంగా కానిస్టేబుల్ మరణించాడని ఆరోపించారు.
ఆ తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ అయ్యాడు. తీవ్ర గాయాల కారణంగా నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రియాజ్ కానిస్టేబుల్ చేతిలో గన్ లాక్కొనే ప్రయత్నం చేయగా పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను అందుపులోకి తీసుకొని బైక్‌పై తీసుకెళ్తుండగా.. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు. రియాజ్‌పై దాదాపు 40కు పైగా కేసులు ఉన్నాయి. అతడు ఇప్పటికే నాలుగైదు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.