నల్గొండలో ఘోర ప్రమాదం..అతివేగంతో మున్సిపల్ కార్మికులు, యువకుడిపైకి దూసుకెళ్లిన కారు (video)

నల్గొండ–హైదరాబాద్ రహదారిపై ఉన్న అన్‌లిమిటెడ్ షాపింగ్ మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Knakam Karthik
Published on : 9 March 2026 3:44 PM IST

Telangana, Nalgonda District, Horrific Accident, Road Accident, CCTV Footage, Speeding Car

నల్గొండలో ఘోర ప్రమాదం..అతివేగంతో మున్సిపల్ కార్మికులు, యువకుడిపైకి దూసుకెళ్లిన కారు (video)

నల్గొండ–హైదరాబాద్ రహదారిపై ఉన్న అన్‌లిమిటెడ్ షాపింగ్ మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు బీభత్సం సృష్టించి, రోడ్డుపై ఊడుస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను బలంగా ఢీకొట్టింది. ఆపై అటుగా స్కూటర్‌పై వెళ్తున్న ఒక యువకుడిని కూడా ఢీకొట్టి గాల్లోకి ఎగురవేసింది. ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ప్రమాదంలో ఒక మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగిపోయాయి. అలాగే స్కూటర్‌పై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయాలవ్వడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story