కరీంనగర్ కిక్కే వేరప్పా.. సంజ‌య్ సీటీ, గంగుల స్టెప్పులతో అంబ‌రాన్నంటిన హోలీ సంబరాలు

Holy Celebratiuons In Karimnagar. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు హోళీని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

By Medi Samrat
Published on : 7 March 2023 5:40 PM IST

కరీంనగర్ కిక్కే వేరప్పా.. సంజ‌య్ సీటీ, గంగుల స్టెప్పులతో అంబ‌రాన్నంటిన హోలీ సంబరాలు

Bandi Sanjay, Minister Gangula Kamalakar Participated In Holi Celebrations


రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు హోళీని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. సామాన్యుల‌ నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు సంబారాల్లో పాల్గొన్నారు. అయితే ఒకే ప్రాంతానికి చెందిన‌ ఇరువురు నేత‌లు హోళీ సంబ‌రాల్లో పాల్గొన్న దృశ్యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం. కరీంనగర్ లోని తెలంగాణ చౌక వద్ద జరిగిన హోలీ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్ స్టెప్పులు వేసి కార్యకర్తలని ఉత్సాహపరిచారు. తాను సామాన్య పార్టీ కార్యకర్తగా మొదలై.. ఒక మంత్రిగా ఎదిగేవ‌ర‌కూ కరీంనగర్ ప్రజలు ఆదరించారని.. ఎప్ప‌టికీ ఇదే అభిమానం తనపై ఉండాలని కోరుతూ.. హోళీ సంబ‌రాల్లో భాగంగా స్టెప్పులు వేసి అందర్నీ అలరించారు. ఈ ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. వందలాదిమంది అభిమానులు కార్యకర్తలు వెంటరాగా.. కోర్టు చౌరస్తాలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొని అందర్నీ ఉత్సాహపరిచారు.. ఈ సందర్భంగా జోష్ తో ఈల వేసిన‌ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, బండి సంజ‌య్ ఇరువురు క‌రీంన‌గ‌ర్ కు చెందిన వారే. వీరిరువురి జోష్‌ చూసిన స్థానికులు.. ఎంతైనా 'మా కరీంనగర్ కిక్కే వేరప్పా' అంటున్న కామెంట్లు చేస్తున్నారు.





Next Story