మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. వరద ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండురోజులు వర్షాలున్నాయనే హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహ దారులు తెగిపోయాయి. అనేక ప్రాంతాల్లో రాకపో కలు నిలిచి పోయాయి. వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ములుగు, హన్మకొండ, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, సిద్దిపే ట, యాదాద్రి భువనగిరి, జిల్లాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.