మరోసారి వార్తల్లో నిలిచిన కల్వకుంట్ల హిమాన్షు
Himanshu Rao elected as CAS president. కల్వకుంట్ల హిమాన్షు.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
By Medi Samrat Published on 7 May 2022 8:50 PM ISTకల్వకుంట్ల హిమాన్షు.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు విజయం సాధించాడు. హిమాన్షు ఈ ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్ గా పోటీ చేశాడు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో ఇంటర్నేషనల్ బకలారియేట్ డిప్లమా ప్రొగ్రాం ఫస్టియర్ చదువుతున్న హిమాన్షు సైతం పోటీ చేశాడు. తొలుత నామినేషన్లు వేసిన విద్యార్థులను ఇంటర్వ్యూ చేసిన ఎన్నికల ప్యానెల్ చివరికి కొందరిని పోటీకి ఎంపిక చేసింది. పోటీలో ఉన్న విద్యార్థులంతా ఓపెన్ ఫోరమ్‌లో తమకు ఎందుకు ఓటు వేయాలో విద్యార్థులకు వివరించారు. ఓట్లను లెక్కించిన పాఠశాల యాజమాన్యం స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. శుక్రవారం గెలుపొందిన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ఓక్రిడ్జ్ యాజమాన్యం ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిని తొలుత ఇంటర్వ్యూ చేసింది. కొందరితో తుది జాబితా రూపొందించి, వారికి ఓటింగ్ నిర్వహించింది. తుది జాబితాకు ఎంపికైన వారిలో హిమాన్షు కూడా ఉన్నాడు. తమకు ఎందుకు ఓటు వేయాలో స్కూలు ఓపెన్ ఫోరంలో హిమాన్షు ఇతర అభ్యర్థులు, విద్యార్థులకు వివరించారు. హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్నేషనల్ బకలారియేట్ డిప్లమా ప్రోగ్రామ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. హిమాన్షుతో పాటు స్కూల్ కెప్టెన్‌గా కె.వీరారెడ్డి, స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్‌గా ఆనన్య ఆనంద్ వాస్కర్, ఆశిష్ గొట్టుముక్కల ఎన్నికయ్యారు.