రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్తం.. ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్‌

High Tension at Raj Bhavan in Telangana.నేషనల్ హెరాల్డ్ కేసులోకాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 7:13 AM GMT
రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్తం.. ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్‌

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో తెలంగాణ రాష్ట్రంలో నేడు రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డికి రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్తంగా మారింది. వివిధ మార్గాల్లో రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డించేందుకు కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భ‌వ‌న్‌కు వెలుతుండ‌గా.. ఖైర‌తాబాద్ కూడ‌లి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆందోన‌కారులు బైక్‌ను త‌గుల‌బెట్టారు. ఆర్టీసీ బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేశారు.

రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డికి కాంగ్రెస్ నేత‌లు పిలుపునివ్వ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ పెద్ద ఎత్తున బారీకేడ్ల‌ను ఏర్పాటు చేశారు. అయితే..కొన్ని చోట్ల కాంగ్రెస్ నేత‌లు వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, జ‌గ్గారెడ్డి, గీతారెడ్డి, భ‌ట్టి విక్రమార్క త‌దిత‌రులు రాజ్‌భ‌వ‌న్ వైపు వెలుతున్నారు. ఈ క్ర‌మంలో వారిని అడ్డుకున్న పోలీసులు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it