తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కేసుపై నేడు హైకోర్టు విచారణ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో విచారణకు రానుంది.

By -  Knakam Karthik
Published on : 24 Nov 2025 7:28 AM IST

Telangana, Panchayat election, High Court, Reservations, Local Body Elections

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కేసుపై నేడు హైకోర్టు విచారణ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో విచారణకు రానుంది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా జీవోలు ఇచ్చామని ప్రభుత్వం కోర్టుకు నివేదించనుంది. ఎన్నికలకు సంబంధించి పూర్తి చేశామని అధికారులు, సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించనుంది.

కాగా మరో వైపు ఆదివారం నుంచి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై మండల కార్యాలయాల్లో జాబితాలను అధికారులు ప్రదర్శనకు ఉంచారు. గ్రామ పంచాయతీ వార్డు స్థానాలకు 2024సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని, సర్పంచ్ స్థానాలకు 2011సెన్సస్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, 2024సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవోలో ఆదేశించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది.

ఈ ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ రాజ్ శాఖ నుంచి గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ తో కూడిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రోటేషన్ల విధానంలో రిజర్వేషన్లు అమలు కానుండటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు మారబోతున్నాయి. వార్డు స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేయాలని నిర్ధేశించింది.

Next Story