గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన హై కోర్టు

High Court Dismisses Govt Petition Over Ganesh Immersion. గణేష్‌ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ

By Medi Samrat  Published on  13 Sep 2021 12:22 PM GMT
గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన హై కోర్టు

గణేష్‌ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గతేడాది కూడా నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్‌ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నగర వ్యాప్తంగా నెలకొల్పిన గణేషుడి విగ్రహాలు నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయకపోవడమే ఇప్పుడు కష్టంగా మారింది.

హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. హుస్సేన్‌ సాగర్‌, ఇతర జలాశయాల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్‌ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.


Next Story