కానిస్టేబుల్‌ నియామకాలకు బ్రేక్‌.. 4 మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశం

తెలంగాణ కానిస్టేబుల్‌ నియామకాలకు బ్రేక్. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని ఆదేశించింది.

By అంజి  Published on  10 Oct 2023 1:04 AM GMT
high court, civil constables, recruitment, telangana

కానిస్టేబుల్‌ నియామకాలకు బ్రేక్‌.. 4 మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశం

తెలంగాణ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్టులో బ్రేక్ పడింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించండి అంటూ తెలంగాణ హైకోర్టు.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని ఆదేశించింది. అందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని సూచించింది. ఆ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు పేర్కొంది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది జరిగిన కానిస్టేబుల్‌ నియామక తుది రాత పరీక్షలో దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తుది ఫలితాలను ఇటీవల ప్రకటించింది. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు తాజా హైకోర్టు తీర్పుతో మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దు అవ్వగా.. ఇప్పుడు తాజాగా కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాల పై హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Next Story