విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టు షాక్

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

By Medi Samrat
Published on : 28 March 2025 9:30 AM

విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టు షాక్

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ నటి విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయింది. ఈ నెల 25న ఆమె మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే హైకోర్టును వ్యక్తిగతంగా ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న విష్ణుప్రియ, రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు మార్చి 20న సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటల పాటు విచారించారు. రీతూచౌదరి విచారణ ఐదున్నర గంటలకు పైగా కొనసాగింది.

Next Story