వారికి ఉరిశిక్ష సరైనదే..దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik
వారికి ఉరిశిక్ష సరైనదే..దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు దోషులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని అప్పీళ్లు దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదే అని వ్యాఖ్యానించింది.
కాగా 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. రెండు బాంబులు వరుసగా పేలిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేలుళ్ల తాలుకూ తీవ్రత వల్ల 18 మంది అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక దర్యాప్తును చేపట్టింది. ఎన్నో ఆధారాలను సేకరించి, టెక్నికల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. మొత్తం 157 మంది సాక్షులను విచారణలో ప్రవేశపెట్టారు. వీరందరి వాంగ్మూలాలతో కేసు మరింత బలపడింది. దర్యాప్తులో “ఇండియన్ ముజాహిద్దీన్” అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ సంస్థకు చెందిన సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనితో పాటు అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ అనే నలుగురు కూడా ఈ కుట్రలో భాగమైనట్టు తేలింది.
ఈ కేసును ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. నిందితులపై విచారణ ముగిశాక, 2016లో కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. అందులో యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఇది దేశంలోని ఉగ్రవాద నిరోధన చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ అప్పీల్‌పై హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించనుంది.