గంటన్నర పాటు రానాను విచారించిన సీఐడీ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ విచారణకు హాజరయ్యారు. CID సిట్ అధికారుల ఎదుట వారిద్దరూ హాజరై విచారణ ఎదుర్కొన్నారు.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 8:40 PM IST

గంటన్నర పాటు రానాను విచారించిన సీఐడీ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ విచారణకు హాజరయ్యారు. CID సిట్ అధికారుల ఎదుట వారిద్దరూ హాజరై విచారణ ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తొలుత విష్ణుప్రియ సిట్ ముందు హాజరయ్యారు. ఈ మేరకు బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలనూ సిట్ అధికారులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై అధికారులు ప్రశ్నించారు.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో దగ్గుబాటి రానా సైతం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను ప్రశ్నించారు సీఐడీ అధికారులు. అయితే, స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సీఐడీకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు గంటన్నరపాటు సీఐడీ అధికారులు రానాను విచారణ చేశారు.

Next Story