'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తితో స్కూల్‌ నిర్మాణం.. తప్పక వస్తానన్న మహేశ్‌ బాబు

Hero Mahesh babu responds on minister ktr comments. మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు

By అంజి  Published on  10 Nov 2021 9:55 AM GMT
శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో స్కూల్‌ నిర్మాణం.. తప్పక వస్తానన్న మహేశ్‌ బాబు

మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ప్రస్తుత సమాజంపై చాలా ప్రభావాన్ని చూపెట్టింది. "తీసుకున్నది ఏదైనా తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావు అయిపోతాం" ఈ డైలాగ్‌ సినిమాకు హైలెల్‌ అని చెప్పొచ్చు. శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివక అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా స్ఫూర్తితో ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలా సేవా కార్యక్రమాలు చేపట్టిన వాడిలో సుభాష్‌ రెడ్డి అనే నాయకుడు ఉన్నారు. దోమకొండలోని బీబీపేట మండలంలో శ్రీమంతుడు సినిమా స్పూర్తితో ఒక అందమైన స్కూల్‌ను కట్టించారు సుభాష్‌ రెడ్డి. శ్రీమంతుడు సినిమా చూసిన తన కొడుకు నేహాంత్‌ ఇలా స్కూల్‌ కట్టించాలని అనడంతో ఆయన ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారు.

స్కూల్‌తో పాటు జూనియర్‌ కాలేజ్‌ని కూడా నిర్మిస్తున్నారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ నిన్న మీటింగ్‌లో మాట్లాడుతూ.. తన నానమ్మ ఊరు కోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను బాగు చేయిస్తానని మాటిచ్చాడు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ స్కూల్‌ను కట్టించారని తెలిస్తే మహేశ్‌ బాబును తీసుకువచ్చే వాడినని కేటీఆర్‌ అన్నారు. అయితే నిర్మాణంలో జూనియర్‌ కాలేజ్‌ పూర్తైన తర్వాత మహేశ్‌ బాబును తీసుకొద్దామన్నారు. ఈ విషయం తెలుసుకున్న హీరో మహేష్‌ బాబు.. స్కూల్‌ నిర్మించడానికి శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోందని అన్నారు. సుభాష్‌ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నాను.. మీరు నిజమైన హీరో మీలాంటి వాల్లే మాకు కావాలి అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక తప్పకుండా శ్రీమంతుడు సినిమా యూనిట్‌తో కలిసి మీ స్కూల్‌కు వస్తానని మహేశ్‌ బాబు చెప్పాడు.


Next Story
Share it