తెలంగాణ నుంచి గ్యాలంటరీ అవార్డులు పొందింది వీరే

జనవరి 26, భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ మెడల్స్‌‌ను ప్రకటించింది కేంద్ర హోం శాఖ. ఈ గ్యాలంటరీ అవార్డులకు మొత్తం 942 మందిని ఎంపిక చేసింది.

By అంజి
Published on : 26 Jan 2025 6:34 AM IST

gallantry awards , Telangana, Police Medals, Republic Day

తెలంగాణ నుంచి గ్యాలంటరీ అవార్డులు పొందింది వీరే

జనవరి 26, భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ మెడల్స్‌‌ను ప్రకటించింది కేంద్ర హోం శాఖ. ఈ గ్యాలంటరీ అవార్డులకు మొత్తం 942 మందిని ఎంపిక చేసింది. పోలీసు, ఫైర్‌, హోంగార్డ్స్‌, సివిల్‌ డిఫెన్స్‌, కరక్షనల్‌ సర్వీసులకు గ్యాలంటరీ అవార్డులను ప్రతి ఏటా కేంద్రం ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఎంపికైన 942 మందిలో 95 మందికి గ్యాలంటరీ మెడల్స్‌, 101 మందికి రాష్ట్రపతి సేవా పథకం, 746 మందికి ఉత్తమ సేవా పథకాలు వరించాయి. గ్యాలంటరీ మెడల్స్‌ పొందిన 95 మందిలో 28 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలవారు కాగా, మరో 28 మంది జమ్ముకశ్మీర్‌లో పనిచేసినవారు ఉన్నారు.

తెలంగాణ నుంచి ఇద్దరు అధికారులకు పోలీస్‌ మెడల్స్‌, మరో 12 మందికి ఉత్తమ సేవా పథకాలు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్‌, కమిషనర్‌ విక్రంసింగ్‌ మన్‌ గ్యాలంటరీ మెడల్స్‌ సాధించిన వారిలో ఉన్నారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ దాట్ల శ్రీనివాసవర్మకు పోలీసు మెడల్స్ ప్రకటించింది. ఐజీ కార్తికేయ, ఎస్పీ అన్నల ముత్యంరెడ్డి, డీఎస్పీ కోటపాటి వెంకట రమణ, డీఎస్పీ అన్ను వేణుగోపాల్‌, డిప్యూటీ కమిషనర్‌ కమాల్ల రాంకుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ మహమ్మద్‌ ఫజ్లుర్‌ రహమాన్‌, ఏఎస్‌ఐ రణ్‌వీర్‌ సింగ్‌ ఠాకూర్‌, ఏఎస్‌ఐ పీటర్‌ జోసెఫ్‌ బహదూర్‌, ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ విదత్యా పాథ్యా నాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎండీ అయూబ్‌ ఖాన్‌లు.. తెలంగాణ నుంచి ఉత్తమ పోలీసు సేవా పథకం పొందిన వారిలో ఉన్నారు.

ఏపీ నుంచి చీఫ్‌ హెడ్‌ వార్డర్‌ కడాలి అర్జునరావు, వార్డర్‌ ఉండ్రాజవరపు వీర వెంకట సత్యనారాయణకు కరెక్షనల్‌ సర్వీస్‌ విభాగంలో పోలీస్‌ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండుసార్లు ఈ పోలీస్‌ పథకాలు ప్రకటిస్తుంది.

Next Story