కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ టూరిస్టుల కోసం హెల్ప్‌లైన్
కశ్మీర్‌లో చిక్కుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా ఉండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.
By Knakam Karthik
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ టూరిస్టుల కోసం హెల్ప్‌లైన్
కశ్మీర్‌లో చిక్కుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా ఉండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పహల్గామ్‌లో ఈ నెల 22వ తేదీన ఉగ్రవాదులు జరిపిన కాల్పు/ల్లో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత జమ్ముకశ్మీర్ ప్రాంతంలొ హై అలర్ట్ ప్రకటించారు. అయితే తాజా పరిస్థితులతో వేలాది మంది టూరిస్టులు తమ పర్యటనలు రద్దు చేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయేందుకు సిద్ధం అయ్యారు. అయితే రవాణా వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడంతో.. వారంతా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.
కశ్మీర్‌లో చిక్కుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా ఉండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, కేంద్ర ఏజెన్సీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. అలాగే.. జమ్ము కశ్మీర్‌లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాలని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు మంత్రి జూపల్లి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేసి సహాయం తీసుకొవాలని మంత్రి కోరారు. పర్యాటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామని, కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు, స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
హెల్ప్ లైన్ నంబర్లు
9440816071
9010659333
040 23450368