దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం నుండి చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే (NH-65) భారీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హయతనగర్ నుండి విజయవాడ వరకు హైవే వెంబడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి వద్ద వంతెనపై వరద ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఉప్పల్ - వరంగల్ రూట్లోనూ వరద ప్రభావం ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దసరా పండుగ సందర్భంగా నగరవాసులు స్వగ్రామాలకు తరలివెళ్లడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలు సైతం రోడ్డెక్కడంతో విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.