ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయ్యాయి. హన్మకొండ చౌరస్తాలో వరద నీరు రహదారిపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాల అశోక జంక్షన్ వెళ్లే దారిలో వరద నీరు నాలాల నుంచి ఎక్కువ రోడ్డు ప్రవహిస్తున్న వరద నీటితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
కాకాజినగర్ నుండి అమృత వైపు వెళ్లే నాలా కూడా వరద నీటితో ఉప్పొంగి రోడ్డుపై ప్రవహిస్తున్నందున హాస్పిటల్ కి వెళ్లే రోగులు అవస్థలు పడుతున్నారు. ఇందిరానగర్, గాంధీనగర్, అండర్ బ్రిడ్జితో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. బాలసముద్రం, హంటర్ రోడ్డుపై వరద నీరు నదులను తలపిస్తోంది.