కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..సిటీలో నదులను తలపించిన రోడ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి
By Knakam Karthik
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..సిటీలో నదులను తలపించిన రోడ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సిటీలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులుతో పాటుగా నగరంలోని అనేక కాలనీల్లోని రోడ్లన్నీ వరద ప్రవాహంతో నదులను తలపించాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లన్ని గంటల పాటుగా వరద నీటిలోనే ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో రహదారి నీటమునిగింది. కలెక్టరేట్ రహదారి, మంకమ్మతోట టూటౌన్ పక్కన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాంనగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, హుస్సేన్ పుర కమాన్ వద్ద నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లోనూ వరదనీరు నిలిచిపోవటంతో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనదారులుసైతం అవస్థలు పడాల్సిని పరిస్థితి నెలకొంది.
మరో వైపు సిటీకి సమీపంలోని అల్గునూర్ చౌరస్తాలోనూ భారీ వరద ప్రవహించింది. దీంతో హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు వెళ్లే రహదారులు నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.