మరో మూడు రోజులు భారీ వర్షాలు..!

Heavy Rains for another Three Days.ఎడతెరిపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sept 2021 2:21 PM IST
మరో మూడు రోజులు భారీ వర్షాలు..!

ఎడతెరిపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌డంతో పాటు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఇదిలా ఉంటే.. మ‌రో మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయ‌న్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇక నిన్నరాత్రి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సుమారు మూడు గంట‌ల పాటు వాన దంచికొట్టింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. రోడ్ల‌పైకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరడంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. కూకట్ పల్లి, కృష్ణా నగర్ లో వాహనాలు కొట్టుకుపోయాయి. రెండుమూడు చోట్ల మనుషులు కూడా కొట్టుకుపోగా స్థానికులు కాపాడారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 9.8 సెంటిమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా.. మలక్ పేట లో 9.6 సెం.మీ, చందానగర్ లో 8.8సెం.మీ, సరూర్ నగర్ లో 8.5సెం.మీ, మూసాపేట్ లో 8 సెం.మీ, మాదాపూర్ లో 7.7సెం.మీ, యూసుఫ్ గూడలో 7.6 సెం.మీ వ‌ర్షపాతం న‌మోదు అయ్యింది.

Next Story