సెప్టెంబర్ 1న తెలంగాణలో భారీ వర్షాలు: ఐఎండీ
సెప్టెంబరు 1న తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By అంజి Published on 30 Aug 2023 8:04 AM GMTసెప్టెంబర్ 1న తెలంగాణలో భారీ వర్షాలు: ఐఎండీ
సెప్టెంబరు 1న తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. దీంతో తెలంగాణ వాసులు త్వరలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందనున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణాలో 2023 సెప్టెంబర్ 1 నుండి 3 వరకు ఉరుములు, మెరుపులు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణాన్ని కూడా అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. గురువారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) అంచనా వేసింది. టిఎస్‌డిపిఎస్ ప్రకారం.. నిన్న తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 40.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, హైదరాబాద్, బండ్లగూడలో అత్యధికంగా 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 566.9 మిల్లీమీటర్లు కాగా, 642.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ విషయానికి వస్తే, ప్రస్తుత వర్షాకాలంలో 463.9 మిల్లీమీటర్ల సంచిత వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 455.9 మిమీ. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ప్రస్తుత నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు నెలలో రాష్ట్రంలో తగినంత వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.