తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది.

By అంజి  Published on  15 Aug 2023 7:28 AM GMT
Heavy rainfall, Telangana, IMD, Hyderabad

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు 

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం,, 2023 ఆగస్టు 18 మరియు 19 తేదీలలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. శుక్ర, శనివారాల్లో వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇదిలావుండగా.. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో మ‌ళ్లీ మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసేందుకు అనుకూలంగా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారుతున్నాయ‌ని ఐఎండీ పేర్కొంది.

హైదరాబాద్ విషయానికొస్తే, రాబోయే మూడు రోజుల పాటు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. టిఎస్‌డిపిఎస్ ప్రకారం.. నిన్న తెలంగాణలో, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 70.3 మి.మీ, హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 12.3 మి.మీ వర్షం కురిసింది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 466.9 మి.మీ కాగా 582.4 మి.మీ. హైదరాబాద్ విషయానికి వస్తే, ప్రస్తుత వర్షాకాలంలో 450.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఎల్‌నినో సంవత్సరం అయినప్పటికీ తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది.

Next Story