వివేకా హ‌త్య కేసు.. హైకోర్టులో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

Hearing on YS Avinash Reddy's anticipatory bail plea adjourned to June 5. వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుదీర్ఘ విచారణ సాగింది.

By Medi Samrat  Published on  28 April 2023 1:45 PM GMT
వివేకా హ‌త్య కేసు.. హైకోర్టులో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుదీర్ఘ విచారణ సాగింది. ఈ రోజు తీర్పు ఇవ్వలేమని బెంచ్ తెలిపింది. వెకేషన్ బెంచ్ ని మార్చుకుంటారా అని జడ్జి అడిగారు. ఇది అర్జెంట్ అని, తీర్పు ఇవ్వాలని ఇరుపక్షాలు కోరాయి. అత్యవసరమైతే చీఫ్ కోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. రేపటి నుండి హైకోర్టుకు సెలవులు ఉండడంతో వెకేషన్ తర్వాత తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అర్జెన్సీ అయితే మాత్రం చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసి అర్జెంట్ అని చెప్పండని సూచించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు అన్ని రోజులు రిజర్వ్ లో పెడితే బాగుండదన్నారు. కాబట్టి సీబీఐ తన పని తాను చేసుకు పోవచ్చునని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. తదుపరి ఉత్తర్వుల వరకు సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ తరఫు లాయర్ కోరగా, అలా ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది కోర్టు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.


Next Story