హెల్త్ టూరిజం హబ్ తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on  22 Jun 2024 10:00 PM IST
హెల్త్ టూరిజం హబ్ తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ 500 నుంచి 1000 ఎకరాల్లో ఉంటుందని.. దానికి అనుగుణంగా భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీపడి ఈ హబ్‌లో అన్ని వ్యాధులకు నాణ్యమైన చికిత్స అందించాలని భావిస్తూ ఉన్నామన్నారు. హబ్‌లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. వివిధ దేశాల నుంచి అనేక మంది రోగులు వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని.. చికిత్స కోసం నగరానికి వచ్చే ప్రజలకు వసతి కల్పించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రణాళికలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి యాజమాన్యం తమ సేవల విస్తరణ కోసం అదనపు స్థలాన్ని కోరింది. ప్రతిపాదిత హెల్త్ టూరిజం హబ్‌లో బసవతారకం ఆసుపత్రికి కూడా స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి అందిస్తున్న సేవలను గుర్తు చేస్తూ.. లీజు వ్యవధి, ఇతర అనుమతుల సమస్యలను యాజమాన్యం తన దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే మంత్రివర్గంలో క్లియర్ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

Next Story