హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ' ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని దత్తాత్రేయ సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు. ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో 'జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా' పేరుతో విడుదలైంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో దీనిని తీసుకువస్తున్నారు.