మంత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
Harish Rao Convoy Accident. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
By Medi Samrat Published on
20 Jun 2021 3:48 PM GMT

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కాన్వాయ్‌కు సడెన్‌గా అడవిపంది అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. దీంతో కాన్వాయ్ లోని వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దాంతో కాన్వాయ్ లో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో కారు ముందుబాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో మంత్రి హరీశ్ రావు సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్ ఇవాళ సిద్ధిపేటలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Next Story